ఆ ఇంట్లో ఏం జరుగుతుందో ఇక లైవ్‌లో చూడొచ్చు!

216

   అమెరికాలోని రోదే దీవిలోని ఉన్న ఒక ఇంట్లో జరిగిన ఘటనతో 2013 లో ‘కంజూరీంగ్’ సినిమా తెరకెక్కించారు. అయితే, ఆ సినిమా మనం చూసిన ఇల్లు సెట్టింగ్ మాత్రమే. అసలైన ఇంటిని బాహ్య ప్రపంచం ఇప్పటివరకు చూడలేదు.

https://i.dailymail.co.uk/1s/2020/05/01/22/27904240-8279293-Eerie_The_filmis_a_fictionalized_take_on_the_real_life_story_of_-m-132_1588369814111.jpg

  ఈ నేపథ్యంలో ‘ద డార్క్ జోన్’ అనే వెబ్‌సైట్ ఆ ఇంటిని లైవ్‌లో చూపించనుంది. కాగా దానికి సంబందించిన ప్రివ్యూ మే 8న ప్రసారం కానుంది. మే 9 నుంచి 24/7 ఆ ఇంట్లో జరిగే ఘటనలను లైవ్‌లో ప్రసారం చేయనుంది. ప్రివ్యూను ఉచితంగానే అందిస్తారు.

https://i.imgur.com/RAQhkOR.jpg

  అయితే, ఆ ఇంట్లో పెట్టిన కెమేరాల ద్వారా లైవ్ ప్రసారాలు చూడాలంటే మాత్రం రోజుకు 4.99 డాలర్లు చెల్లించాలి, మొత్తం వారమంతా ఆ ఇంటిని చూసేందుకు 20 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రజలకు ఇది మాంచి టైంపాస్ అని నిర్వాహకులు తెలుపుతున్నారు.