భారత్‌లో 62కి చేరుకున్న కరోనా కేసులు.. ఆ రాష్ట్రంలో తొలి మరణం?

296
first corona death india

   కరోనా వైరస్ ప్రపంచం మొత్తాన్ని గడగడలాడిస్తుంది. చైనాలో మొదలైన ఈ వైరస్ అన్ని ఖండాలకూ వ్యాపించించి. భారత్‌లో కరోనా కేసుల సంఖ్య బుధవారనికి 62కు చేరుకుంది. బుధవారం (మార్చి 11) ఢిల్లీలో ఒకటి, రాజస్థాన్‌లో మరొకటి కొత్త కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 62కి చేరినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కేరళలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటికే 17కి చేరుకుంది. రాజస్థాన్‌లోనూ కరోనా బారినపడ్డ వారి సంఖ్య 17కి పెరిగింది. అయితే.. రాజస్థాన్‌లో కరోనా బారిన పడ్డ వారిలో 16 మంది ఇటలీ కి చెందినవారే కావడం గమనార్హం. (first corona death india)

   అయితే.. కోవిద్ 19 వైరస్ అనుమానిత లక్షణాలతో కర్ణాటకకు చెందిన ఓ వృద్ధుడు (76) మృతి చెందాడు. కలబుర్గికి చెందిన ఇతడు ఫిబ్రవరి 29న సౌదీ అరేబియా నుంచి తిరిగొచ్చాడు. కరోనా లక్షణాలు కనిపించడంతో ఆయణ్ని గుల్‌బర్గా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో చేర్పించారు. తరవాత హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో అడ్మిట్ చేయగా.. చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మరణించాడు. అయితే.. ఆయన కరోనా వైరస్ కారణంగానే మృతి చెందారా లేదా వయసు ప్రభావం లాంటి తదేతర అంశాలు నిర్ధారించాల్సి ఉంది. కరోనా వల్లే మృతి చెందితే భారత్‌లో తొలి కరోనా మృతి ఆయనదే అవుతుంది (first corona death india).

  • 3
    Shares