‘రౌడీ బేబి..’ సాంగ్‌కు డ్యాన్స్‌ ఇరగదీసిన బాలీవుడ్‌ హీరోయిన్

70
Mithila Palkar

ధనుష్‌, సాయిపల్లవి హీరో హీరోయిన్లు గా నటించిన చిత్రం ‘మారి 2’. ఈ చిత్రంలో రౌడీ బేబీ సాంగ్‌ ఎంత పాపులర్‌ అయిందో అందరికీ తెలిసిన విషయమే.

Mithila Palkar

ఈ సినిమా వీడియో సాంగ్‌ ఏకంగా 95 కోట్లకు పైగా వ్యూస్‌ను దక్కించుకుని ఓ రికార్డ్‌నే క్రియేట్‌ చేసింది. ఈ పాటకు చాలా మంది టిక్‌టాక్ వీడియోలను కూడా రూపొందించారు. ఇంత సెన్సేషనల్‌ సాధించిన ఈ పాటకు ఇంకా క్రేజ్‌ తగ్గడం లేదు.

Mithila Palkar

అయితే ఇప్పుడు బాలీవుడ్‌ నటి మిథిలా పాల్కర్‌ ఈ పాటకు స్పెప్ట్‌ వేస్తూ తన ఇనస్టాగ్రామ్ లో ఇరగదీసింది. కొరియోగ్రాఫర్‌ స్వరతో కలిసి మిథిలా ఈ స్టెప్స్‌ వేశారు. ఈ వీడియోను మిథిలా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. పెప్పీ డ్యాన్స్‌ బీట్‌కు నెటిజన్స్‌ నుండి మంచి స్పందన వస్తుంది.

Mithila Palkar

బాలీవుడ్‌లో వైవిధ్యమైన చిత్రాల్లోనటిస్తూ హీరోగా ప్రత్యేకతను చాటుకుంటున్న ఆయుష్మాన్‌ ఖురానా సైతం మిథిలా పాల్కర్‌ షేర్‌ చేసిన వీడియోకు నాకు ఈ సాంగ్ అంటే చాలా ఇష్టమంటూ రిప్లయ్‌ ఇవ్వడం విశేషం.

Mithila Palkar