కొంప ముంచిన స్నేహం..

99
Rakul Preet Singh

డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్ నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) విచారణకు శుక్రవారం హాజరైంది. ఈ విచారణ సందర్భంగా పలు కీలక విషయాలను వెల్లడించినట్టు వార్తలు వస్తున్నాయి. తానెప్పుడూ డ్రగ్స్ సేవించలేదని, `డ్రగ్ చాట్` మాత్రం చేశానని రకుల్ అంగీకరించిందట.

Rakul Preet Singh

అలాగే రియాతో డ్రగ్స్ గురించి మాట్లాడినట్టు, రియా కోరిన మేరకు తన ఫ్లాట్‌లో డ్రగ్స్ దాచినట్టు రకుల్ అంగీకరించిందట. రకుల్ నిజంగా ఈ విషయం అంగీకరించినట్టైతే ఆమె అరెస్ట్ తప్పదని ప్రముఖ న్యాయవాది ఒకరు వెల్లడించారు.

Rakul Preet Singh

ఎన్డీపీఎస్ చట్టం 8(సి) ప్రకారం డ్రగ్స్‌ను దాచడం పెద్ద నేరమని ఆయన పేర్కొన్నారు. పైన పేర్కొన్నట్టు రకుల్ స్టేట్‌మెంట్ ఇవ్వడం నిజమైతే ఆమె అరెస్ట్ తప్పదని ఆయన తెలిపారు.

Rakul Preet Singh

డ్రగ్స్ వాడడం కంటే ఇది పెద్ద నేరమని ఆయన పేర్కొన్నారు. కాగా, రకుల్ ముంబై వెళ్లినప్పుడల్లా రియాతోనే కలిసి తిరిగేదని, ఆమెతో కలిసి పార్టీలకు, పబ్బులకు వెళ్లేదని తెలుస్తోంది. రకుల్‌కు ఈ స్థితి రావడానికి రియాతో స్నేహమే కారణమని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.

Rakul Preet Singh in Drug Case