కరోనా వ్యాక్సిన్ కోసం 5 లక్షల షార్క్ చేపలను..

64
Corona Vaccine

కరోనా వ్యాక్సిన్ కోసం సుమారు 5 లక్షల షార్క్ (సొర) చేపలను వేటాడేందుకు సన్నహాలు జరుగుతున్నాయట. అయితే వీటిని వ్యాక్సిన్ ప్రయోగం కోసం కాదు తయారీ కోసం ఉపయోగించనున్నారు. ఈ చేపల కాలేయంలో ‘స్క్వాలేన్’ అనే ఆయిల్ తయారువుతుంది. దీన్ని ఔషదాల తయారీలో ఉపయోగిస్తారు.

Corona Vaccine

కరోనా వైరస్ వ్యాక్సిన్‌ లో ఉపయోగిస్తున్న ఔషదాల్లో ఇది కూడా ఉందని జంతు ప్రేమికులు తెలుపుతున్నారు. ప్రపంచమంతా వ్యాక్సిన్ సిద్ధం చేయడం మొదలుపెడితే.. రెండు డోసుల కోసం సుమారు 5 లక్షల షార్క్ చేపలు అవసరం అవుతాయని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో షార్క్ చేపలను చంపొద్దంటూ ఉద్యమానికి సిద్ధమవుతూ ఆన్‌లైన్ పిటీషన్ ద్వారా సంతకాలను సైతం సేకరిస్తున్నారు.

Corona Vaccine
Stefanie Brendl is the founder and executive director of Shark Allies, who have launched a petition against the use of squalene from sharks for making coronavirus vaccine

దీనిపై షార్క్ అలియాస్ వ్యవస్థాపకురాలు స్టెఫానీ బ్రెండల్ మాట్లాడుతూ. ‘‘షార్క్‌లు చాలా అరుదైనవి. సాధారణ చేపల తరహాలో వాటి పెంపకం సాధ్యం కాదు. వాటి పునరోత్పత్తి కూడా చాలా ఆలస్యంగా ఉంటుంది. ఏటా వ్యాక్సిన్ కోసం వాటిని చంపుకుంటూ పోతే.. భవిష్యత్తులో అవి కనుమరుగు అవుతాయి. మేం కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ ఆపాలని అనుకోవడం లేదు. షార్కులకు బదులు ఇతర విధానాల్లో ‘స్క్వాలేన్’ సేకరణకు ప్రయత్నించాలని మాత్రమే కోరుతున్నాం’’ అని తెలిపారు.

Corona Vaccine