బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్ పై పోలీస్ కేసు

123
బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్ పై పోలీస్ కేసు

తమిళ, తెలుగు భాషల్లో కథానాయికగా నటిస్తున్న సనంశెట్టి, నటుడు బిగ్ బాస్ ఫేమ్ దర్శిన్‌ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి ఆ తర్వాత ఆమెను మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ విషయమై నటి సనంశెట్టి ఆ మధ్య స్థానిక ఆడయారు మహిళా పోలీస్‌ స్టేషన్‌లో దర్శిన్‌ పై ఫిర్యాదు చేసింది.

police case registered against big boss darshan

దర్శిన్, తాను ప్రేమించుకున్నామని.. పెళ్లి చేసుకుంటానని మాటివ్వడంతో ఏడాది పాటు కలిసి తిరిగామని తెలిపింది. అయితే ఇప్పుడు దర్శిన్‌ తనతో మాట్లాడడం మానేశాడని, తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తున్నాడని చెప్పింది.

police case registered against big boss darshan

అతనిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో తెలిపింది. కాగా ఆమె ఫిర్యాదుపై పోలీసులు విచారణ జరిపారు కానీ దర్శిన్‌ పై ఎలాంటి కేసు నమోదు చేయలేదు. దీంతో ఆమె కోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు దర్శిన్‌ పై కేసు నమోదు చేశారు. దర్శిన్‌ను అరెస్ట్‌ చేసే అవకాశం ఉందని వైరల్ అవుతుంది.

police case registered against big boss darshan

 

View this post on Instagram

 

Great eve with @sam.sanam.shetty

A post shared by Tharshan Thiyagarajah (@tharshan_shant) on